నిందితులకు ప్రభుత్వ అండదండలు: ఎమ్మెల్యే
1 min readకుటుంబానికి పది లక్షలు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడాల మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామంలో వాసంతి (9) అనే చిన్నారిని అతి కిరాతకంగా పాడుచేసి హత్య చేసి నేటికీ ఏడు రోజులు అయినా కూడా మృతదేహాన్ని గుర్తించలేదంటే మైనర్ నిందితులకు రాచ మర్యాదలు చేస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి అన్నారు. శనివారం మధ్యాహ్నం ముచ్చుమర్రి గ్రామంలో బాధిత కుటుంబం వాసంతి తల్లి దండ్రులతో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇన్ని రోజులు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని హోం మంత్రి అనిత స్పందించకపోవడం లేదని మా వైసిపి ప్రభుత్వ హాయంలో ప్రభుత్వం వెంటనే స్పందించేదని ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి అన్నారు.ఈ విషయం గురించి జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదన్నారు.ఇంత చిన్న వయసు లోనే పిల్లలు ఇంత ఘోరమైన పనులు చేస్తే ఇంకా పెద్దగా అయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చని ఇలాంటి వారిని ఉరి తీయాలి లేకపోతే కాల్చి వేయాలంటూ ఆయన ఘాటుగా మాట్లాడారు. నిందితులకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అదేవిధంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పగిడ్యాల మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, తువ్వా చిన్న మల్లారెడ్డి,రమేష్ నాయుడు పాల్గొన్నారు.