139 వ మేడే ఉత్సవాలు విజయవంతం: సిఐటియూ
1 min read
హొళగుంద న్యూస్ నేడు : స్థానిక హోళగుంద బస్టాండ్.సమతాగేరి గ్రామాల్లో సిఐటియు నాయకులు రామాంజనేయులు అధ్యక్షతన మే డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐటీయూ సీనియర్ నాయకులు వెంకటేష్ కట్టప్ప సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు చేతుల మీదుగా సిఐటియు జెండాను ఆవిష్కరించడం జరిగింది.మాట్లాడుతూ ముఖ్యంగా 1886 అమెరికా చికాగో నగరం హే మార్కెట్ వద్ద జరిగిన పోరాటంవలనే 8 గంటల పని దినం సాధ్యమైందని తెలిపారు. ఈ పోరాటంలో చనిపోయిన కార్మికులందరికీ ముందుగా నివాళులు అర్పిస్తున్నాము. అంతేకాకుండా తమ రక్తాన్ని చిందించి ఎనిమిది గంటల పని దినం సాధించుకున్న రోజు అని తెలిపారు. ఆలాంటి పోరాట దినం మేడేని కొనియాడారు. ప్రాణాలర్పించి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని ప్రస్తుతం ఉన్న బిజెపి ప్రభుత్వం తుంగులో తొక్కుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణను వేగవంతం చేస్తుందని విమర్శించారు. కార్మికులు ఉద్యోగుల ద్వారా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఉద్యోగులకు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం స్కీం వర్కర్ల వీఆర్ఏ అందరికీ కనీస వేతనాలు లేవని తెలిపారు. అసంఘటితరంగా కార్మికుల పరిస్థితి మరింత దారుణమని తెలిపారు. ఈ మేడే సందర్భంగా కార్మికుల హక్కుల కోసం , మున్సిపల్, రిమ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ పర్మినెంట్ చేయాలని, జీతం పెంచాలని, మినిమం 26వేల వేతన వేయాలని,రాజిలేని పోరాటాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీలు గంగన్న నగేష్ నారాయణ వెంకటేష్. ఉలిగయ్య. ఈరన్న. సిద్ధప్ప.తదితరులు పాల్గొన్నారు.
