అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, అవి లోపిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత అని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. గురువారం ఆయన కొత్తపేటలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువలను పరిశీలించారు. అంతకన్నా ముందు ఓల్డ్ కంట్రోల్ రూమ్, పెద్దపడఖాన, అంబేద్కర్ సర్కిల్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో మొత్తం రూ.44.47 కోట్లతో 330 రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అందులో కొన్ని పూర్తికాగా, మిగిలినవి వివిధ దశలో ఉన్నాయన్నారు. ఈ పనులన్నీ పక్కా నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈ సత్యనారాయణ, డిఈ గంగాధర్, శానిటేషన్ ఇంస్పెక్టర్ మునిస్వామి పాల్గొన్నారు.