భూ సేకరణ కేసులను త్వరితగతిన పరిష్కరించండి…
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : భూ సేకరణ కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో భూ సేకరణ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లకు సంబంధించి మండలాల వారీగా భూసేకరణ కేసుల గురించి సమీక్షించారు..ఏ మండలంలో ఎన్ని భూసేకరణ సమస్యలు ఉన్నాయి, ఎంత డబ్బు చెల్లించాల్సి ఉంది, అందుకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను అడిగి తెలుసుకున్నారు…భూసేకరణ కు సంబంధించి కోర్టు కేసులపై వెంటనే స్పందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..పరిహారం చెల్లింపునకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని,ఈ అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కి సూచించారు.శాఖల వారీగా ఏ ఏ కేసులు ఉన్నాయి, ఎంత డబ్బు చెల్లించాలి అన్న వివరాలతో నివేదిక ను సిద్ధం చేయాలని కలెక్టర్ డిఆర్వో ను ఆదేశించారు.ఈ నివేదికను సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ లు, సిసిఎల్ఏ, జీపీ, ఏజిపి లకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.భూ సేకరణ కేసులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సంబంధిత ఆర్డీఓ లకు పంపించాలని కలెక్టర్ భూ సేకరణ సెక్షన్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, అనూరాధ, అజయ్ కుమార్, జిపి , ఏజిపి లు తదితరులు పాల్గొన్నారు.