బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తాం…
1 min read

ఓర్వకల్లులో పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు
రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్
క్రెడాయ్ ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో ప్రారంభించిన మంత్రి
కర్నూలు టౌన్, న్యూస్ నేడు : కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ అతిథులతో కలిసి ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. స్టాల్స్ యజమానులు తమ వెంచర్ల గురించి మంత్రికి వివరించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు భావించాలన్నారు. జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 14 వేల కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ ప్రాజెక్టు కు క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందని, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశ్రమకు కూడా క్యాబినెట్లో క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనంతరం క్రెడాయ్ ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో డైరీని మంత్రి ఆవిష్కరించారు.


