ఎస్సీ కులాలకు న్యాయం జరగాలని ఎస్సీ వర్గీకరణ
1 min readఆమోదించిన న్యాయం స్థానం.. ధన్యవాదాలు… తెలియజేసిన మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు ఉలిగయ్య,జనసేన మండల నాయకులు రామాంజనేయులు, కురువ సంఘం నాయకులు వీరేష్
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రమైన విలేకరులు సమావేశం నిర్వహించగా సమావేశంలో మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేయడం ద్వారా నేటికి ఫలించిందని ఉల్లిగయ్య పేర్కొన్నారు. ఎస్సి కులాలలో అట్టడుగున అణచివేతకు గురవుతూ మరియు అన్ని విధాలా నష్టపోతూ వస్తున్న ఎస్సీ కులాలకు న్యాయం జరగాలని ఎస్సీ వర్గీకరణ చేస్తే ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం జరుగుతుందని ఎ,బి,సి,డి కేటగిరి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపవర్గీకరణ చేసే వెసులుబాటు కల్పించటం శుభదినం అని తెలియజేస్తూ,ఆనాడు 1994 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాల్లో ఉద్యమం మొదలు పెట్టి దాదాపు 3 దశాబ్దాలు పోరాడి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులు ఆమోదం తెలియజేయ్యడం సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ, ఈ తీర్పు వలన సామాజిక,ఆర్థిక,ఉద్యోగ న్యాయం జరుగుతుందని ఆనాడే మన చంద్రబాబు నాయుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్న ధర్మాసనం ఒప్పుకోక ఇన్ని రోజులకు ఇప్పుడు న్యాయం జరిగిందని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన న్యాయస్థానానికి, నరేంద్ర మోడీకి, మందగ మాదిగా కృష్ణ,చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపారు. కౌతాళంలో నాయకులు కూడా వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గిరి,రామాంజి,ముకన్నా, వలి,గొట్టయ్య,చిరంజీవి,శ్రీరామ్, షాల్లు,బద్రి గురు పాల్గొన్నారు.