బాలికలు ఉన్నత చదువులు చదవాలి
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు : బాలికలు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తీసుకురావాలని సిడిపిఓ నరసమ్మ పేర్కొన్నారు. మంగళవారం మంత్రాలయం లోని రాఘవేంద్ర నగర్ లో ఉన్న 4 వ అంగన్వాడి కేంద్రం లో కిషోర్ వికాస్ వేసవి సెలవుల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ కె నరసమ్మ మాట్లాడుతూ మే రెండవ తేదీ నుంచి జూన్ 10 వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాలికల ఉన్నత విద్య నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. వారి భవిష్యత్తు మార్గదర్శకాలు పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రత పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి వీర గోవిందమ్మ, పి హెచ్ సి జ్యోతి, మహిళా పోలీస్ శాంతి, అంగన్వాడి టీచర్ బి.వి.శ్వేత,ఆశా సుజాత, కే లలిత మరియు ఆయాలు, కిషోర్ బాలికలు, వి వి కే మహిళా సంఘం లీడర్స్ పాల్గొన్నారు.