NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

20  లీటర్ల నాటు సారా.. 22 మద్యం బాటిల్లు స్వాధీనం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు వారి ఆదేశముల మేరకు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్  మరియు వారి సిబ్బంది కర్నూలు టౌన్ నందు ఉన్న బంగారుపేట లో  ధాడులు జరుపగా బంగారుపేటకు చెందిన నీలి షికారి అనరీ అను ఆడ వ్యక్తి  వద్ద 20  లీటర్ల నాటు సారాను మరియు నీలి షికారి లక్ష్మీ వద్ద 30  లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని,  సదరు ఇద్దరు మహిళ లను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. మరియొక్క కేసు నందు కల్లూర్ ఎస్టేట్ కి చెందిన జక్కల మునయ్య వద్ద 22 మద్యం బాటిల్లు మరియు దేవర అంజినేయులు వద్ద 15 మద్యం బాటిల్లు స్వాదీనము చేసుకొని, ఇద్దరు మగ వ్యక్తి లను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు.  ఈ దాడులలో కర్నూల్ స్టేషన్  సబ్-ఇన్స్పెక్టర్ కె.నవీన్ బాబు, రెహన బేగం మరియు కానిస్టేబుల్ సిబ్బంది మధు, సూర్యనారాయణ, రామలింగయ్య, ఈరన్న, సువర్ణమ్మ పాల్గొన్నారు అని తెలిపినారు.

About Author