NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాతో మానసిక ప్రశాంతత…

1 min read

నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు

న్యూస్ నేడు కర్నూలు జిల్లా ప్రతినిధి : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నగరపాలక సంస్థ మేనేజర్ చిన్న రాముడు అన్నారు. గురువారం  ఖానా-ఖజానా వద్ద స్ట్రీట్ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. యోగాతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, కోచ్లు అక్షర, మునిస్వామి, జిల్లా యోగ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్‌లు పాల్గొన్నారు.

About Author