NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి స‌హాయ‌నిధి ద్వారా పేద‌ల‌కు అండ‌గా ఉంటున్నాం.. రాష్ట్ర మంత్రి

1 min read

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు,న్యూస్​ నేడు:  ముఖ్యమంత్రి స‌హాయ నిధి ద్వారా పేద‌ల‌ను ఆదుకుంటున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో నలుగురికి ముఖ్యమంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన చెక్కుల‌ను ఆయ‌న అంద‌జేశారు. పోడూరి లలిత అనే మహిళకు రూ.1,48,327, దినేష్ కుమార్ కు రూ.2,64,008, సయ్యద్ అంజాద్ బాషా కు రూ.45,700, పూజారి జయలక్ష్మి అనే మహిళకు రూ.15000లు చెక్కుల‌ను మంత్రి టీజీ భ‌ర‌త్ అంద‌జేశారు. ఆప‌ద స‌మ‌యంలో కర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌ను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి టీజీ భ‌ర‌త్ కృత‌జ్నత‌లు తెలిపారు. చెక్కులు అందుకున్న వారు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి టీజీ భ‌ర‌త్ ల‌ మేలు మ‌రిచిపోలేమ‌ని సంతోషం వ్యక్తం చేశారు.

About Author