NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేదలకు వరం చంద్రన్న భీమ పథకం

1 min read

మంత్రాలయం న్యూస్​ నేడు :  నిరుపేదలకు వరం చంద్రన్న ప్రమాద భీమా పథకం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సూగురు గ్రామంలో పద్మశాలి శారదమ్మా అనే మహిళ జనవరి నెలలో ద్విచక్ర వాహనం ప్రమాదంలో మృతి చెందింది.  ఆమె టీడీపీ సభ్యత్వం కలిగి ఉండటం వలన వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రూ 5 లక్షల ప్రమాద బీమా ను మంజూరు చేసింది. ఇందులో భాగంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. మా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రూ 5 లక్షల చెక్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి కి భీమ వర్తిస్తుందని తెలిపారు. పార్టీలకతీతంగా టిడిపి సభ్యత్వం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు చావిడి వెంకటేష్, సాగునీటి సంఘం ఛైర్మెన్ మాలపల్లి చంద్ర, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య,  నరసింహులు,గోపాల్,శేఖర్, భాస్కర్ రెడ్డి, రామకృష్ణ,,ఇజ్రాయిల్, నాగరాజు, హైస్కూల్ ఛైర్మెన్ హనుమంతు, ఎలిమేంటరి స్కూల్ ఛైర్మెన్ రాముడు, పవన్,వేమిరెడ్డి, కూటమి  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author