NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేషన్ సరుకుల పంపిణీ లో  రాష్ట్రం లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం

1 min read

జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు: రేషన్ సరుకుల పంపిణీ లో  రాష్ట్రం లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం లో ఉందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.జూన్ రెండవ తేదీ నాటికి  ఎఫ్ పి షాపుల ద్వారా 2,42,975 మంది కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసి రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు.ఎండియూ రేషన్ వాహనాల ద్వారా ఏప్రిల్  నెలలో రెండవ తేదీ నాటికి   1,10,574 మందికి, మే నెలలో  రెండవ తేదీ  నాటికి 1,29,218 కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయగా,  ఈ నెలలో రేషన్ షాపుల ద్వారా  2,42,975 మంది  కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గతంతో పోలిస్తే  ఈ నెలలో రెట్టింపు కార్డుదారులకు ఎఫ్ పి షాపుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ జరిగిందని కలెక్టర్ తెలిపారు.

About Author