NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి

1 min read

ప్రగతి కనబరచకపోతే ఉపేక్షించం

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లాలో ఇళ్ల ప్రగతికి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశగా గృహనిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ నుండి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు.  రానున్న 10 రోజుల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి కనబడాలన్నారు.  ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మృతి చెందిన లబ్దిదారుల కుటుంబాల్లో లీగల్ హైర్ కలిగి ఇళ్లు నిర్మించుకోవడానికి సుముఖత తెలిపేవారు, సుముఖత లేనివారు సమగ్ర వివరాలను రేపటికల్లా అందజేయాలని ఆదేశించారు.  ప్రగతి తక్కువగా ఉన్న మండలాల్లో పర్యటించి వాస్తవ పరిస్ధితులను గుర్తించాలని హౌసింగ్ పిడి ని కలెక్టర్ ఆదేశించారు.  ఫేజ్-3 ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్లతో హౌసింగ్ ఎఈ, డిఈ లతో కలిసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి నూరుశాతం పూర్తిచేయడంపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పిడి డి. సత్యనారాయణ, జిల్లాలోని పలువురు డిఈలు, ఏఈలు, హాజరయ్యారు.

About Author