NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు లో పెట్రెగిపోతున్న కాల్ మనీ గ్యాంగ్

1 min read

నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర,జిల్లా నాయకులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు తంగెళ్ళమూడి   ప్రాంతం అరుంధతి కాలనీకి చెందిన జొన్నకూటి ఆంజనేయులు ఎస్సీ మాదిగ  కులానికి చెందిన కుర్రోడు పై  కాల్ మనీ గ్యాంగ్ ఇంటికి వచ్చి  వాహనంపై ఎక్కించుకొని కండ్రిక గూడెం సెంటరు  ఎస్ఎస్   బార్ సమీపము వద్దకు తీసుకెళ్లి  రాడ్లు ,కర్రలు తో విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు. ఆపై  మాదిగ నాకొడకా నిన్ను చంపేస్తాం అంటూ నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి. జేబులో ఉన్న డబ్బులు మరియు సెల్ ఫోన్ లాక్కొని చంపబోయారని  ఆంజనేయులు పేర్కొన్నాడు, సొమ్ము సిల్లి పడి ఉన్న నన్ను దగ్గరలో ఉన్న న్న వాళ్ళు  గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినారని తెలిపాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు  హుటాహుటిన ఏలూరు గవర్నమెంట్ హాస్పటల్ వెళ్లి బాధితుడు ని పరామర్శించి జరిగిన దాడి ఘటన విషయాన్ని తెలుసుకున్నారు. కాల్ మనీ నిందితులు నలుగురి  పై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటి మరియు 307 సెక్షన్ నమోదు చేయాల నాని డిమాండ్ చేశారు.  ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బయ్యరపు రాజేశ్వరరావు,రాష్ట్ర  నాయకులు కాశీ కృష్ణ, జిల్లా నాయకులు బయ్యరపు కుటుంబరావు,సయ్యద్ అలీ వంగల పూడి యోబు, వినయకుమార్, జొన్నకుటి గిరిజ,బల్లా హేమలత దాడి విషయాన్ని తీవ్రంగా ఖండించారు.

About Author