NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించిన వీరభద్రగౌడ్

1 min read

న్యూస్ నేడు ఆలూరు : తెలుగుదేశం పార్టీ యువనేత విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ.నారా లోకేష్ బాబు పేదప్రజలకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో సరికొత్తగా ఆలోచించి వారికి విద్యార్థు లకు పుస్తకాల బరువును తగ్గించారు.అలాగే నాణ్యమైన బ్యాగులు,బట్టలు,షూ ఇలా అన్నిటిని సమూలంగా ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి బి. వీరభద్రగౌడ్  ఆలూరు పట్టణంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో (మెయిన్ స్కూల్లో) శ్రీ.డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించి విద్యార్థులకు ఆయనే స్వయంగా వడ్డించారు.అలాగే యువ నాయకులు .గిరిమల్లేష్ గౌడ్  కూడా విద్యార్థులకు శ్రీ.డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజనంలో ఇచ్చే గుడ్లపైన పెంకులు తొలగించి ఇవ్వాలని అక్కడ వంటవారికి తెలియజేశారు.అలాగేఇంచార్జి వర్యులు శ్రీ.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాకానుక అయిన స్కూల్ బ్యాగులు, బట్టలు విద్యార్థులకు పంపిణీచేశారు. ఈకార్యక్రమంలో స్కూల్  హెచ్​ఎం  అలాగే ఉపాధ్యాయులు ఆలూరు పట్టణ మరియు మండల కూటమి ప్రభుత్వ నేతలు కార్యకర్తలు,క్లస్టర్, బూత్,యూనిట్ ఇంఛార్జిలు, టిడిపి సర్పంచ్ లు,  ఎంపీటిసి   లు,వివిధ హోదాలలో ఉన్న  ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అలాగే తెలుగు యువత,  ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్​, టిఎన్​టియుసి,    ,టిడిపి శోషల్ మీడియా,మహిళా సంఘాలు అలాగే టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు, కార్యకర్తలు అందరూ   పాల్గొన్నారు.

About Author