యోగా సాధనతో మానసిక ప్రశాంతత
1 min read

నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు
యోగా దినోత్సవం కోసం సన్నాహాక ప్రదర్శన
17న 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో యోగా
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం ప్రతి రోజూ యోగ ఆసనాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు అన్నారు. శనివారం ఆయన బుధవారపేటలోని 30వ సచివాలయ పరిధిలో యోగా దినోత్సవం కోసం సన్నాహాక సాముహిక ప్రదర్శనలో పాల్గొని, యోగా ఆసనాలు చేశారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, సమాజంలో యోగాను విస్తృతంగా తీసుకెళ్తున్నామన్నారు. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా శనివారం నగరంలో అన్ని సచివాలయాల పరిధిల్లో సన్నాహాక సాముహిక ప్రదర్శనలు చేపట్టామని, వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ నెల 17న ఔట్‌డోర్ స్టేడియంలో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గడిచిన మూడు వారాలుగా విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు ఉత్సాహంగా ఆసనాల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మేనేజర్‌తో పాటు ఆర్ఐ రాజు, తదితరులు పాల్గొన్నారు.

