ప్రజా సమస్యలపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలి
1 min read

అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం
కర్నూలు, న్యూస్ నేడు: ప్రజల నుంచి వచ్చిన వినతులను చిత్తశుద్ధితో పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశించారు. నేటి ఉదయం బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చట్టబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో మంత్రి సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి ఆయా సమస్యలకు పరిష్కరించడం జరిగింది. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.. ఈ అర్జీలు స్వీకరణ కార్యక్రమంలో సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో బాధితుల నుంచి సర్వత్రా సంతోషం వ్యక్తమైంది. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహంచిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.


