NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం కి అభినందనలు తెలిపిన టీడీపీ యువ నాయకులు…

1 min read

ఐటిడిపి హనుమంతు , మండల యువ నేత మంజునాథ్ గౌడ్…

రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పడింది…

న్యూస్ నేడు హొళగుంద: హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేరుల సమావేశంలో ఐటీడీపీ తాలూకా కార్యదర్శి హనుమంతు మరియు మండల యూత్ నాయకుడు మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ… సూపర్ సిక్స్ లో భాగంగా మరో ముఖ్యమైన హామీకి సిఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తెలిపారు అని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లులకు కానుక గా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13 వెలు చొప్పున తల్లుల ఖాతాలో నగదు జమ చేశారుఅన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో కేవలం 40 లక్షల మంది విద్యార్థులకే అమ్మఒడి ఇచ్చారని కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పేరిట ప్రతి ఒక్క ఒక్క విద్యార్థికి 13వెలు ఇస్తున్నారు అని అన్నారు.తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు , త్వరలోనే అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వనికి అభినందనలు తెలిపారు .

About Author