NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం సహాయనిధి సంజీవిని వంటిది

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటిచంటి

25 మంది లబ్ధిదారులకు16 లక్షల, ఒక వెయ్యి 255 రూపాయల విలువైన సహాయ నిధులు చెక్కులు పంపిణీ

ప్రతి పేదవాడికి ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : అనారోగ్యంతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవని వంటిదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టంచేశారు. సీఎం రిలీఫ్‌ఫండ్‌తో ఎంతోమంది బాధితుల జీవితాల్లో ఆర్ధిక భరోసా నింపుతున్నామన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. తమ అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులందించిన వారికి త్వరితగతిన సిఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతోన్న చొరవ ప్రశంసనీయంగా నిలుస్తోంది. ఇదేక్రమంలో గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 25 మంది లబ్దిదారులకు 16లక్షల ఒకవెయ్యి 255 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి పేదవారికి ఆర్ధిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటివరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2కోట్ల 22 లక్షల 81వేల 390 రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్ధిక సాయం అందించే విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా ఉపయుక్తంగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే చంటి భవిష్యత్తులో మరింత మంది అవసరార్థులకు ఆర్ధిక సాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, కో-ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం,ఎస్సెమ్మార్‌ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author