పాఠశాల ఆవరణంలోని నీటి తొలగింపుకు చర్యలు
1 min readగ్రామ పంచాయతీ సిబ్బందితో పనులు… పరిశీలించిన టిడిపి నాయకులు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఇటీవల మంత్రాలయం లో కురిసిన వర్షాలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు చేరి దుర్వాసన వెదజల్లుతోందని టిడిపి పట్టణ ఇంచార్జీ బి వరదరాజు లు, ఎంపిటిసి మేకల వెంకటేష్, అశోక్ రెడ్డి లు నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయులను పత్రికల ద్వారా ప్రశ్నించడంతో స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిలిచి ఉన్న నీటిని మోటారు ద్వారా సమీపంలో ఉన్న డ్రైనేజీ చాంబర్ల కు పంపింగ్ చేశారు. నీటి పంపింగ్ పనులను పరిశీలించారు. పాఠశాల కమిటీ చైర్మన్ నరసింహ, శివ డేవిడ్ రాజు పాఠశాల నిధుల అంశంపై టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి దృష్టికి తీసికెళ్ళామని నిధుల వినియోగంపై ఆరా తీస్తామని వరదరాజులు పేర్కొన్నారు. మోటారు ద్వారా నీటిని పంపింగ్ చేయు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కంతం భీమయ్య, విజయ్, భీమేష్, తదితరులు ఉన్నారు.