సీఎన్ హాస్పిటల్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవం
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : బెంగళూరు నగరాల తరహాలో కర్నూల్ నగరం కూడా మెడికల్ హబ్ గా మారుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.కర్నూలు నగరంలోని సీఎం హాస్పిటల్ నందు రియా ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డితో కలిసి టీజీ వెంకటేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎటువంటి మెరుగైన వైద్య సేవలు కావాలన్నా హైదరాబాద్, బెంగళూర్ వంటి మెట్రో నగరాలకి పరిగెత్తాల్సి వచ్చేదని, ఇప్పుడు అటువంటి అవసరాలు లేకుండా అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో, అన్ని రకాల వైద్య సేవలు కర్నూల్ నగరంలో అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మెరుగైన వైద్య సేవలకు కర్నూలు నగరమే ప్రధాన కేంద్రంగా మారుతుందని ఇది మనందరం గర్వించదగ్గ విషయమని టీజీ వెంకటేష్ అన్నారు. రియా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా పిల్లలు కలగని వారు అధునాతన చికిత్స ద్వారా వైద్య సేవలు పొంది పిల్లలు కనడానికి అవకాశం ఉంటుందన్నారు. సీఎన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజశేఖర్ ఎన్నో ఏళ్లుగా తన సేవలను కర్నూలు ప్రజలకు అందిస్తున్నారని, ఇప్పుడు వారి వారసులు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ తిలక్ మహేష్ లు అధునాతన చికిత్సల ద్వారా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత గౌరవ వెంకటరెడ్డి, డాక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.