NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధ పిల్లలకు ఆధార్..

1 min read

  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సాధి కమిటీ సభ్యులు  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి  పి .లీల వెంకట శేషాద్రి గారి ఆదేశాల మేరకు జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల  సూచనలతో ఆధార్ లేని అనాధలకు ఆధార్ ఐడెంటిటీని  ఇప్పించి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు సహాయపడడానికి స్పెషల్ ఆధార్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నది .అందులో భాగంగా సాధీ కమిటీ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంగారుపేట, భాగ్యనగర్ తదితర ప్రాంతాలలో సచివాలయ పరిధిలో నిర్వహించిన ఆధార్ స్పెషల్ డ్రైవ్ లో 20 మంది ఆధార్ లేని వారిని గుర్తించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆనందమ్మ, మీనాక్షి, బంగారుపేట సచివాలయ వెల్ఫేర్ సెక్రెటరీ మోనాలి తదితరులు పాల్గొన్నారు.

About Author