NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురువులను బదిలీ చేసిన బిషప్ జ్వాన్నేష్..

1 min read

నంద్యాల డీన్ గా ఫాదర్ కేడీ జోసఫ్

నందికొట్కూరు ఫాదర్ బాలరాజు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: కర్నూలు నంద్యాల జిల్లాలో ఉన్న ఆర్ సీఎం వివిధ 47  విచారణల గురువులను కర్నూలు బిషప్ మహా శ్రీ గోరంట్ల జ్వాన్నేష్ బదిలీ చేశారు.నందికొట్కూరు వేళాంగణి మాత విచారణ గురువుగా ఉన్న ఫాదర్ కేడీ జోసఫ్ నంద్యాల ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం దేవాలయ విచారణ గురువులుగా మరియు డీన్ గా బాధ్యతలు స్వీకరించారు.ఫాదర్ కేడి జోసఫ్ కు ఘన స్వాగతం పలికారు.తర్వాత దివ్య బలి పూజను సమర్పించారు. గురువులు మర్రెడ్డి,జార్జి ఇన్నారెడ్డి ఘనంగా సత్కరించారు.

గురువుల బదిలీల వివరాలు

వికార్ జనరల్ గా ఫాదర్ అర్లప్ప,నూతన డీన్ గురువు లుగా కర్నూలు జాన్ డేవిడ్, నంద్యాల కేడి జోసఫ్, కోయిలకుంట్ల జి చిన్నప్ప, ఆదోని జి ప్రవీణ్,అనంతపురం జోజి రెడ్డిలను నియమించారు.కేడిఎస్ఎస్ డైరెక్టర్ గా తోట జోసెఫ్, డయాసిస్ యూత్ డైరెక్టర్ గా భాస్కర్,బిషప్ హౌస్ పర్సనల్ సెక్రెటరీ ఈ ప్రవీణ్,డయాసిస్ సెక్రటరీ మరియు ప్రాజెక్టు మేనేజర్ ఇంద్రారెడ్డి,జీవసుధా పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ బాలరాజును నందికొట్కూరు వేళాంగణి మాత పుణ్యక్షేత్ర దేవాలయ విచారణ గురువుగా నియమించారు. జూపాడుబంగ్లా ఫాదర్ బాల యేసు,వెంకాయ్య పల్లి డేవిడ్ అర్లప్ప,ఓర్వకల్లు కోలా విజయ రాజు,గడివేముల ఆండ్రూ, యూత్ డైరెక్టర్ గా ఉన్న రాజేంద్రను పెద్ద కడబూరు, గుంతకల్లుకు చౌరప్ప, కర్నూలు కథిడ్రల్ గా ప్రతాప్ రెడ్డి,జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గా తోట జోసెఫ్ లను నియమించారు.

About Author