ఏ ఆర్ అదనపు ఎస్పి ఎన్ ఎన్ ఎస్ శేఖర్ పదవి విరమణ
1 min read

ఏ ఆర్ పోలీస్ సిబ్బంది కవాతు,వీడ్కోలు,గౌరవ వందనం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై సోమవారం నాడు పదవీ విరమణ చేస్తున్న ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్.ఎస్.ఎస్. శేఖర్ కి ఏ ఆర్ పోలీస్ సిబ్బంది వీడ్కోలు కవాతు మరియు గౌరవ వందనం సమర్పించినారు. ఏలూరు జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి వెన్ను గా నిలిచిన అదనపు ఎస్పీ శ్రీ ఎన్.ఎస్.ఎస్. శేఖర్ పదవీ విరమణ (రిటైర్మెంట్) పొందుతున్న సందర్భంలో, ఆయన సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఉదయం ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా వీడ్కోలు కవాతు కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్ నేతృత్వంలో, ఏఆర్ సిబ్బంది శేఖర్ కి వందనం సమర్పించారు. ఆయన ఎంతో కాలం పాటు పోలీస్ విభాగానికి అందించిన కృషి, నిబద్ధత మరియు నాయకత్వం గర్వించదగినవిగా నిలిచాయి.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు మాట్లాడుతూ ఆయనకు ఆరోగ్యంగా, ఆనందంగా పదవీ విరమణ అనంతరం జీవితం కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.పలువురు అధికారులు, సహచరులు ఆయన సేవలను కొనియాడుతూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియ చేసినారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ కూడా శేఖర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన అనుసరించిన విధేయతా మార్గదర్శకాలు తదుపరి తరాల పోలీస్ సిబ్బందికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ పదవీ విరమణ చేస్తున్న అదనపు ఎస్పీ ఏఆర్ వారి కార్యక్రమానికి ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, ఏ ఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్, ఆర్.ఎస్.లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


