NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

1 min read

న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండలం వందవాగిలి, గజ్జెహళ్లి, ఎండి హళ్లి గ్రామలలోహొళగుంద మండలం ఇంచార్జి కెంచప్ప ఆధ్వర్యంలోపద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు  మండల ఇంచార్జి కెంచప్ప ఆలూరు తాలూకు కో ఇంచార్జి మల్లికార్జున మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ లో దళితుల హక్కుల, సాధికారిత కోసము ఏర్పడిన సంఘము. ఎస్సీ రిజర్వేషన్లను కూడా బీసీ రిజర్వేషన్ల తరహాలో ఎ,బి,సి,డిలుగా వర్గీకరించి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఉన్న రిజర్వేషన్లను వాటికి పంచి కేటాయింపులు చేయాలన్నది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్. ఈ డిమాండ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానాశయం. ఈ సంఘాన్ని మంద కృష్ణ మాదిగ 1994, జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో స్థాపించారు.మొదట్లో మందకృష్ణ నాయకత్వంలో కేవలం 20మంది యువకులు ప్రారంభించిన ఈ ఉద్యమం… అనతి కాలంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించింది. మాదిగల సహజ సామాజిక న్యాయానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అన్ని రాజకీయపార్టీలు మద్దతుగా నిలిచాయి. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా ఎస్సీలలో మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు వెనుకబడి ఉన్నారని, వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని ప్రభుత్వం గుర్తించింది. మాదిగల పోరాటాలు, ఆమరణ నిరహార దీక్షల ఫలితంగా 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ చట్టం జరిగింది. ఇది నాలుగేళ్లపాటు అమల్లో ఉంది.అయితే వర్గీకరణ అనేది దళితుల్లో ఐక్యత దెబ్బతీస్తోందని మాలల సామాజిక వర్గానికి చెందిన కొందరు సుప్రీంకోర్టుకెళ్లారు. దీంతో కేవలం రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్డు కులాల వర్గీకరణ కుదరదని, దీనికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరని స్పష్టం చేస్తూ అప్పటి దాకా నాలుగేళ్లపాటు అమల్లో ఉన్న ఏబీసీడీల వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది.దీంతో మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు మళ్లీ మలిదశ పోరాటం మొదలుపెట్టారు.2024 ఆగస్టు 2న  సుప్రీంకోర్టులోని ఏడుగురు జడ్జిల్లో ధర్మాసనములో ఆరుగురు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు.ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు ఇవ్వడం జరిగింది అన్నార.జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ గ్రామాలలో నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దేవప్ప, నాగరకన్వి వెంకటేష్, కెంచప్ప, అంజినయ్య, కల్లప్ప, ఉల్లేష్,దాసప్ప, మృత్యుంజయ, గోవిందు, జార్జి, నగేష్,హనుమప్పగ్రామ అధ్యక్షులు కృష్ణ, రంగప్ప, భూషణం ఎమ్మార్పీఎస్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

About Author