బాపురం, కామవరం గ్రామంలో ఎంఆర్పిఎస్ నూతన కమిటీలు ఏర్పాటు
1 min read

కౌతాళం న్యూస్ నేడు : గ్రామాలలో జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా జరుపాలన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గ ఆదేశాల మేరకుజులై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్ ) 31 వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపి ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జండాలను ఎగురవేసి మాదిగల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేలా అన్ని గ్రామాల వాడవాడలలో మాదిగ దండోరా జెండా రెపరెపలాడాలన్న లక్ష్యం తో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆనంద్ ఆద్వర్యంలో బాపురం జయ రాజు,నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ కో ఇన్చార్జ్ ముగతి ప్రతాప్ కుమార్ ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలు ఏర్పాటు మందకృష్ణ మాదిగ అదేశాలని , ఈ ముప్పై సంవత్సరాలు మందకృష్ణ మాదిగ చేసిన ఉధ్యమ విజయాలను వివరిస్తూ జులై 7లోపే అన్ని గ్రామ కమిటీలు మరియు ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ గ్రామాలలో నిర్వహించాలని వారు కోరారు. ఈ మేరకు అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల కమిటీ భాధ్యులు ఆనంద్ మాదిగ లింగలదిన్నె నాగరాజ , ప్రకాశ్ జయరాజు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , మరియు కామవరం తిమోతి, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది..
అధ్యక్షుడు : అశోక్ , వర్కింగ్ ప్రెసిడెంట్ : రమేష్ , ఉపాధ్యక్షులు 1 : వెంకోబ , ఉపాధ్యక్షులు 2 : దేవపుత్ర , కార్యదర్శులు 1 : ప్రతాప్,వీరయ్య,హనుమయ్య, ప్రధానకార్యదర్శి : పామన్న, కోశాధికారి : జలాలి , ప్రచార కార్యదర్శి : ఉలిగన్న , కార్యవర్గ సభ్యులుగా : ఉచ్చప్ప, ఈరేష్ , మహాదేవ , మధు , రామకృష్ణ , గోపాల్ , ప్రకాశ్ , చిన్న బసవ , నాగరాజ లను కౌతాలం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో , గ్రామ మాదిగ పెద్దల సమక్షంలో ఎన్నుకున్నారు , ఆత్మీయ సన్మానం :మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ కో ఇన్చార్జ్ ముగతి ప్రతాప్ కుమార్ మాదిగ , మండల అధ్యక్షుడు ఆనంద్ , లింగలదిన్నె నాగరాజు , గ్రామ అధ్యక్షుడు అశోక్ లకు ఆత్మీయ సన్మానం చేసి శాలువా కప్పి , పూలమాలతో సత్కరించారు.


