వన మహోత్సవం ర్యాలీని ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవం ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తో పాటు పాఠశాల బోధన ,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు మొక్కలను చేత పట్టుకొని ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని చెప్పారు. మొక్కలు నాటి వృక్షాలుగా పెంచడం వల్ల అవి మనిషికి ఎంతో అవసరమైన లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ ను దశాబ్దాల పాటు అందజేస్తాయని చెప్పారు. ప్రకృతిలోని సకల జీవరాసులు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఆయన వివరించారు. అలాగే విద్యార్థులు కూడా విద్యార్థి దశలోనే క్రమశిక్షణ ,అంకిత భావాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని చెప్పారు. అనంతరం భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవ ర్యాలీనీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. తమ పాఠశాల అభివృద్ధికి ఆయన సంపూర్ణ సహకారం అందజేస్తున్నారని, భవిష్యత్తులో ఆయన సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

