NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రయాణం కల్పించండి

1 min read

విజయవాడ ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వినతిపత్రం అందజేత

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ కృష్ణా జిల్లా,రాష్ట్ర స్థాయి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (Reg.No.9548/2000) ప్రతినిధులు శనివారం స్థానిక ఆర్టీసీ జోనల్ చైర్మన్ కార్యాలయంలో జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడును మర్యపూర్వకంగా కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,వైద్య సేవల కోసం లేదా కుటుంబ అవసరాల నిమిత్తం తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సులలో కూడా రిటైర్డ్ ఉద్యోగులు,వారి భార్య/భర్తలకు ఉచిత ప్రయాణం కల్పించాలి” అని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సానుకూలంగా స్పందిస్తూ, “రిటైర్డ్ ఉద్యోగులు సంస్థకు సేవలందించిన వారు. వారి కృషిని గుర్తించి సూపర్ లగ్జరీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున జోనల్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానాల గంగాధరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధుల బృందంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి,రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

About Author