లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న భారత స్టాక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికన్ మార్కెట్లు గత వారం లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ఆసియా మార్కెట్లు కూడ పాజిటివ్ గా కదులుతున్నాయి. దీంతో భారత మార్కెట్లు కూడ అదే బాటలో నడుస్తున్నాయి. బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, మెటల్, మౌలిక రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో నిఫ్టీ 50- 76 పాయింట్ల లాభంతో 15,766 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 35,370 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.