జిల్లా ఎస్పీ ఆదేశాలతో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
1 min read

మహిళల భద్రతకు ప్రత్యేక కార్యచరణ
సత్రంపాడు ఆదిత్య కళాశాలలో కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ పై అవగాహన
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,ఐపీఎస్ ఆదేశాలపై సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం, మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రవేశపెట్టిన శక్తి యాప్ పై అవగాహన సదస్సు ను నిర్వహించినా ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ఈ కార్యక్రమం ఏలూరు ఆదిత్య డిగ్రీ కళాశాల సత్రంపాడు లో నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్,మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు,సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ దాసు మరియు మహిళా ఎస్సై వల్లి పద్మ పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించినారు.”శక్తి యాప్” ఉపయోగించే విధానం టోల్ ఫ్రీ నెంబర్ 7993485111 సైబర్ నేరాల తీవ్రత,వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెనివెంటనే 1930 కి సమాచారం అందించిన యెడల వారి సహాయ సహకారాలను అందిస్తారనిమహిళలకు సంబంధించిన చట్టాలు, వాటి ఉపయోగాలుఅత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవలసిన టోల్ ఫ్రీ నంబర్లు (112, 181, 1091 మొదలైనవి)వంటి అంశాలపై విద్యార్థులకు విశదీకరించడమేగాక, ప్రాక్టికల్ డెమోస్ ద్వారా అవగాహన కల్పించబడింది.డీఎస్పీ మాట్లాడుతూ, “మహిళలు మరియు యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. శక్తి యాప్ వంటి టెక్నాలజీ ఆధారిత సాధనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు భద్రత గా ఉండగలరూ అని తెలియ చేసినారు. ఈ అవగాహన సదస్సు ద్వారా,విద్యార్థులు తమ హక్కుల గురించి, ఆపత్కాలంలో తీసుకోవలసిన చర్యల గురించి స్పష్టత పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు తెలియజేశారు.ఈ కార్యక్రమం విద్యార్థుల నుండి మంచి స్పందనతో ప్రదర్శించడంతో పోలీసు అధికారులు భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలియ తెలియజేశారు.


