చారిత్రక చరిత్ర కలిగిన కాలేజ్ కోట దెబ్బ జూనియర్ కాలేజ్
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
సుమారు 500 మంది విద్యార్థినీ,విద్యార్థులకు యూనిఫాం పంపిణీ
ఉన్నత చదువులు అభ్యసించి కాలేజీకి,అధ్యాపకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి
మేయర్ నూర్జహాన్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హేలాపురి చరిత్రలో ఎంతో గొప్పస్థానం ఉందనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆ కీర్తిని మరింత ఇనుమడింపచేసే విధంగా విద్యార్ధులు విద్యలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అవసరార్థులకు సమయోచిత సాయం అందించీ, ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇదేక్రమంలో గత ఏడాదికాలంలో అనేక సేవా కార్యక్రమాలను దగ్గరుండీ ముందుకు నడిపించారు. దీనిలో భాగంగా ఏలూరు కోటదిబ్బలోని జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తోన్న ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు తన సొంత నిధులతో యూనిఫాం అందించే కార్యక్రమాన్ని గురువారం అర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్‌తో కలిసి యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 250 మంది విద్యార్ధులు, 150 మంది విద్యార్ధినులకు ఒక్కొక్కరికీ రెండు జతల యూనిఫామ్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరులో ఎంతో చరిత్ర ఉన్న కళాశాల కోటదిబ్బ జూనియర్ కళాశాల అని పేర్కొన్నారు. గతంలో ఎంతోమంది ప్రముఖులు ఇదే కళాశాలలో చదివి ఉన్నతస్థానానికి చేరుకున్నారని అన్నారు. అలాగే ప్రస్తుతం విద్యనభ్యసిస్తోన్న విద్యార్ధులంతా క్రమశిక్షణతో విద్యలో రాణించీ, భవిష్యత్తులో అంతేగొప్పగా స్థిరపడాలని అన్నారు. మహిళలు ఉన్నత చదువులు అభ్యసించి ఎన్నో రంగాలలో రాణించారన్నారు. మీరు కూడా అదే విధంగా క్రమశిక్షణతో చదువును కొనసాగించి అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఇటువంటి ఆదర్శవంతమైన సేవాకార్యక్రమాలను విద్యార్ధులు భవిష్యత్తులో నిర్వహించాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. నగర మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి ఎంతో స్ఫూర్తివంతమైన సేవలు అందిస్తూ వస్తున్నారన్నారు. అలాగే విద్యార్ధులకు ఉపయుక్తమైన సేవలనెన్నింటినో ఆయన నిర్వహిస్తున్నారనీ, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం,కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి నాయకులు బెల్లపుకొండ కిషోర్, కళాశాల ప్రిన్సిపల్ ఎ. రాజ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


