డిప్యూటీ మేయర్ గా పప్పు ఉమా మహేశ్వరరావు కి చోటు
1 min readఅభినందించిన పలు కార్పొరేటర్ లు
కూటమి ప్రభుతంలోనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం
యం.ఎల్.ఎ బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ గా “పప్పు” కి చోటు తొలిసారిగా “పద్మశాలీ” సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. అల్పజనుల ఆధిక్యతను పెంపొందించడం కోసం తమ సొంత కులానితో పాటు ఇతర కులాల వారి నమ్మకాన్ని చూర గొనగలిగిన గొప్ప నాయకుడు బడేటి చంటి అని మరోసారి నిరూపించుకున్నారు. సామాజిక నిర్మాణంలోనే నీతి అనేది పునాదిగా ఉండాలని భావించి అన్ని కులాల వారికి ప్రాధాన్యతనిస్తూ, పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ బడేటి తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆ పార్టీకి మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. దానిలో భాగంగానే డిప్యూటీ మేయర్ పదవి పప్పు ఉమామహేశ్వరరావు కి దక్కటం అభినందనీయమని నగర పౌరులతో పాటు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు కోరుతున్నారు.