అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను చంద్రబాబు సెట్ చేస్తున్నారు
1 min read

కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు, న్యూస్ నేడు: అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను సీఎం చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్నారని.. ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కర్న్నూలు నగరం లోని 26వ వార్డు, లక్ష్మి నగర్ ప్రాంతంలో కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, రాష్ట్ర సివిల్ కార్పోరేషన్ డైరెక్టర్ కొంకటి లక్ష్మి నారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర మరియు స్థానిక నాయకులు, మహిళలతో కలిసి పర్యటించారు. ఈ సంధర్బంగా వారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, పింఛన్ల పెంపు ఉచిత ఇసుక విధానం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేత తో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని సోమిశెట్టి వివరించారు. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా నారా చంద్రబాబు, నారా లోకేష్ గార్లు పని చేస్తున్నట్లు తెలిపారు.స్థానిక మహిళలు డ్రైనేజి విషయమై ఫిర్యాదు చేయగా మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతామని వారికి హామి ఇచారు.

