NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదరికం లేని సమాజం స్థాపించడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యం

1 min read

నియోజకవర్గం లో 10 వేల బంగారు కుటుంబాలు ఎంపిక

టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్

మంత్రాలయం న్యూస్​ నేడు: రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో  సబ్ కలెక్టర్ నేతృత్వంలో స్వర్ణాంధ్ర-P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో 6-10వేల బంగారు కుటుంబాలు ఎంపిక కానున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, లక్ష మంది మార్గదర్శకులను గుర్తిస్తామని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తూ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. పీ-4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని ఇది సంక్షేమానికి అదనమని స్పష్టం చేశారు. పీ-4 పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని  సీఎం చంద్రబాబునాయుడు  ఆదేశించినట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం లో మంత్రాలయం లో ఇళ్ల స్థలాలు డబ్బు ఉన్న వాళ్లకే ఇచ్చారని నిరుపేదలకు ఇవ్వలేదని ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్ వారి దృష్టికి తీసుకెళ్లారు. . దీనికి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి విచారణ జరిపి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సబ్ కలెక్టర్ ను కోరారు.  అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు  నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో ఎంపిడిఓ నూర్జహాన్, తహసీల్దార్ రమాదేవి, విద్యుత్ ఏఈ గోవింద్, నరవ రమాకాంత్ రెడ్డి , నరవ శశిరేఖ గారు,నాలుగు మండలాల ఎంపీడీవోలు,ఎమ్మార్వోలు అధికారులు , సచివాలయం సిబ్బంది,సర్పంచ్ లు,ఎంపీటీసీ లు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About Author