మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు.. డీఎస్పీ
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం ఇచ్చిన వారికి, తల్లిదండ్రులపై చర్యలుంటాయని కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ తెలిపారు . కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూల్ నగరంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విహార్ సెంటర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చారు. లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న మైనర్ల ను పట్టుకున్నట్టు తెలిపారు. 15 మంది మైనర్ వాహనాలను కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించిన ట్టు తెలిపారు. మైనర్లు పట్టుబడితే తక్షణమే కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని, మార్పు రాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లైసెన్స్ లే కుండా బండి నడపబోమని మైనర్లచేత ప్రతిజ్ఞ చే యించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనల వీడియో షోలు మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు మైనర్లకు చూపించారు. మొదటిసారిగా కౌన్సిలింగ్ చేసి ,రెండవసారి పట్టు బడితే జరిమానాలు విధించనున్నామని ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్ తెలిపారు.

