ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయం : ఎమ్మెల్యే
1 min read

పత్తికొండ ,న్యూస్ నేడు: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ అన్నారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని 20వ వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కె ఈ శ్యామ్ కుమార్ పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ముందుగాగ శ్రీ.శ్రీ.శ్రీ.బాట సవారమ్మ అమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ.కే.ఈ. శ్యామ్ కుమార్ వివరించారు. ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని మై టిడిపి యాప్ లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేశారు. తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంటబీమా, ఉచిత ఇసుక, పెంచిన పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, పిహెచ్ సిల్లో మెరుగైన సేవలు ,విద్యార్థులకు తల్లికి వందనం , స్కూళ్ల ఆధునికీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళా భద్రత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు . రానున్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


