NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఏలూరు ఎమ్మెల్యే

1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు పాముల దిబ్బలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పాముల దిబ్బలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఓ వ్యక్తి హత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని ముందుగానే దృష్టి సారించామని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసామని తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ  చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి (ఎంపీ) టూ టౌన్ సిఐ అశోక్ కుమార్,టిడిపి నాయకులు బెల్లపుకొండ కిషోర్,పలివెల కిషోర్ పాల్గొన్నారు.

About Author