NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు భోజనాల ప్లేట్లు పంపిణీ

1 min read

చిన్నహేట కన్నడ పాఠశాలలో  200 మంది విద్యార్థులకు భోజనాల ప్లేట్లను అందించిన…

యుఆర్డిఎస్ వ్యవస్థాపక  అధ్యక్షుడు సిహెచ్.నాగరాజ్  సేవలు అభినందనీయం

బాలాజీ పెట్రోలియం లిమిటెడ్ ప్రొప్రైటర్ సిహెచ్ శేషగిరి

హొళగుంద న్యూస్ నేడు : ఉషోదయ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు  యు ఆర్ డి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు  సిహెచ్ నాగరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించి 200 భోజనాల ప్లేట్లను  పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  బాలాజీ పెట్రోలియం లిమిటెడ్ ప్రొప్రైటర్ చిన్నహేట శేషగిరి పాల్గొన్నారు.హొళగుంద మండల పరిధిలోని చిన్నహేట గ్రామంలో గల కన్నడ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం ఉషోదయ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నహేట నాగరాజు విద్యార్థుల కోసం భోజనాల పేర్లు పంపిణీ చేయాలని…తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని 200 మంది విద్యార్థులకు భోజనాల కోసం ప్లేట్లను పంపిణీ కార్యక్రమం చేపట్టడం అది కూడా తాను చదివిన పాఠశాలలో విద్యార్థులకు ఇవ్వడానికి ముందుకు రావడం గర్వకారణమని బాలాజీ పెట్రోలియం లిమిటెడ్ ప్రోపరేటర్ చిన్న హేట శేషగిరి కొనియాడారు.అలాగే సేవ చేయాలన్న బలమైన ఆలోచన రావడంతో  ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏకే మారెప్ప.. పాండురంగ… ఖలందర్… ఉపాధ్యాయిని నాగమణి… అందరికీ సమాచారం అందించి… భోజనం సమయానికే పిల్లలకు ప్లేట్ల అందించడం హర్షదాయకమన్నారు.అంతేకాకుండా చిన్న పేట గ్రామంలోని పాఠశాలలో చదివిన చాలామంది విద్యార్థులు వారి పేరులో చిన్న హేట గ్రామం కలిపి పేరు రాయడం…పెదనాన్న అయినటువంటి ఉపాధ్యాయుడు  రామదాసు కృషియే అన్నారు.అంతేకాకుండా  పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం చేతులు అందిస్తానని ఎలాంటి సహకార కోసమైన తన దృష్టికి తీసుకురావాలని తప్పక తాను తనవంతుగా సహకారం అందించడానికి  ముందు ఉంటానని బాలాజీ పెట్రోలియం లిమిటెడ్ ప్రొప్రైటర్ చిన్న హేట శేషగిరి ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు.అంతకుముందు ప్రధానోపాధ్యాయులు  ఏకే మారెప్ప మరియు పాండురంగ.. ఉపాధ్యాయులు ఖలందర్  మాట్లాడుతూ…. విద్యార్థులకు మెరువైన విద్యను అందించడానికి  అలాగే వారి జీవనశైలి విధానంలో  క్రమశిక్షణను అలవరచి ఉన్నత చదువులు చదివినందుకు తమ వంతు కృషి చేస్తామని… పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 200 భోజనాల ప్లేట్లను ఉషోదయ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిన్నహేట నాగరాజు అందించడంపై  హర్షం వ్యక్తం చేస్తూ  అభినందిస్తూ సత్కరించారు.యు ఆర్ డి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిన్నహేట నాగరాజు మాట్లాడుతూ బడికి వచ్చే విద్యార్థులు…. మధ్యాహ్నం పూట భోజనాల కోసం అని ఇండ్లకు వెళ్లి ప్లేట్లు తీసుకురావడం జరుగుతుందని  భోజనాల ప్లేట్లను తీసుకొచ్చే సమయంలో ఆలస్యంగా రావడం పట్ల చదువుకు దూరమవుతున్నారని…. అది గమనించి…. ఉషోదయం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినా తన  దృష్టికి  ఉపాధ్యాయులు తీసుకొచ్చారని….. ఉపాధ్యాయుల  వినతి మేరకు….స్పందించిదాదాపు 20 వేల రూపాయలు విలువ చేసే 200 భోజనాల ప్లేట్లను 200 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి బాలాజీ పెట్రోలియం లీటర్ ప్రొప్రైటర్ చిన్న హేటశేషగిరి చేతుల మీదుగా భోజనం ప్లేట్లను  అందించినట్లు యు ఆర్ డి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్న పేట నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి కమిటీ చైర్మన్ నీలకంఠ  హార్డ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు హెచ్.చలపతి… పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author