శ్రీ మూల రామునికి ప్రత్యేక పూజలు
1 min read

మంత్రాలయం , న్యూస్ నేడు: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 354 వ సప్త ఆరాధనోత్సవాలలో భాగంగా ఆరవ రోజు బుధవారం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో సంస్థాన పూజలు పురస్కరించుకుని శ్రీ మూల రామ దేవతలకు విశేష పంచామృతాభి షేకం, నిర్మల్య అభిషేకం, వేద వ్యాసుల పూజలు చేశారు. అంతకు ముందు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి నిత్య, విశేష అభిషేక పూజలు నిర్వహించారు. బృందావనానికి పట్టు వస్త్రాలు, స్వర్ణ కవచాలు, అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ప్రహ్లాద రాయులను, పల్లకి సేవ, కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి, మహోపాధ్యాయ రాజా ఎస్ గిరియాచార్యులు, ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, బిందుమాధవచార్, కుర్డీ జయతీర్థాచార్, పూజారి వ్యాసరాజ్ స్వామి ,తదితరులు ఉన్నారు.


