పంచాయితీ కార్యదర్శులకు పదోన్నతి..
1 min read

పంచాయితీ కార్యదర్శుల బదిలీ..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 120 మందికి పదోన్నతులు పొందారు.వీరందరికీ జిల్లా పంచాయతీ అధికారులు కౌన్సిలింగ్ ద్వారా వారికి స్థానాలను కేటాయించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో పనిచేస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించింది.పదోన్నతి పొందిన వారిలో సుంకేసుల పంచాయతీ కార్యదర్శి ఎం. వినోద్ అలగనూరుకు బదిలీ చేశారు.చింతలపల్లె పీఎస్ ఎస్.బీజాన్ భీ అవుకు మండలం సంగపట్నం కు బదిలీ చేశారు.అదేవిధంగా తిమ్మాపురం పీఎస్ గా పని చేస్తూ ఇటీవలే ఆత్మకూరు మండలం కరివేన కు బదిలీపై వెళ్లిన ఎస్ ఫరీద్ అహ్మద్ ఎమ్మిగనూరు మండలం కోటేకల్ పీఎస్ గా బదిలీ చేస్తూ జిల్లా అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.వీరంతా 2019లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 02.10.2019 విధుల్లో చేరారు.దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు మండలంలో పనిచేశారు.

