సీఎం ని కలిసి వినతిపత్రం ఇచ్చిన ( బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు)
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, సోషల్ మీడియాలో పోస్టింగ్ లపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా. శనివారం శ్రీశైలం లో విజయవాడ నుండి శ్రీశైలం వరకు సీ ప్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి శ్రీశైలం చేరుకున్న సందర్భంగా బిజెపి నాయకురాలు మోమిన్ షబానా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు లైంగిక వేధింపులు గురించి చంద్రబాబు నాయుడు వినతి పత్రం సమర్పించారు.