మిడుతూరులో ప్రశాంతంగా నిమజ్జనం..
1 min read

రంగులు చల్లుకుంటూ సంతోషాల నడుమ నిమజ్జనం..
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో వినాయకుని గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా శుక్రవారం జరిగింది.మిడుతూరులో ఐదు చోట్ల వినాయకుని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేశారు. మూడవ రోజున నిన్న ఉదయం నుండి ప్రజలు మహిళలు టెంకాయలు కొడుతూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఉదయం నుండి చెన్నకేశవ పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో వినాయకుని ఊరేగింపులో విద్యార్థులు చక్కటి డాన్సులు కోలాటంతో అందరినీ ఆకట్టుకున్నారు.మధ్యాహ్నం వినాయక మండపాల దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.వినాయకుని కట్ట దగ్గర హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు వేలం పాటలో వీఆర్వో ఎం రాఘవేంద్ర అత్యధికంగా 41,500 రూ.ల లడ్డును దక్కించుకున్నారు. అంతేకాకుండా రామాలయం గుడి దగ్గర ఉన్న వినాయకుని లడ్డును తువ్వా అయ్యపు రెడ్డి 7,500 రూ.లకు దక్కించుకున్నారు.ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ చక్కటి డాన్సులతో గ్రామంలో ఊరేగింపు అనంతరం రాత్రి దాకా తలముడిపి ఎస్ఆర్ బీసీ కాలువలో గణేష్ నిమజ్జనం చేశారు.సిబ్బందితో కలిసి మిడుతూరు ఎస్ఐ ఓబులేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హరిప్రసాద్,జయరాం యాదవ్,జనార్ధన్ యాదవ్, మహేష్ యాదవ్,కిరణ్ యాదవ్,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


