NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాతృ భాషా దినోత్సం…

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాతృ భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి జయంతి సందర్బంగానిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్  సుబ్రమణ్యం మాట్లాడుతూ విదేశీ కవులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని కీర్తించిన గొప్ప భాష మన తెలుగు భాష. తెలుగు భాష అభివృద్ధి కోసం గిడుగు రామమూర్తి (రామ్మూర్తి) పంతులు విశేషంగా కృషి చేశారు. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటాం. తెలుగు భాషా తల్లి లాంటిది అని విద్యార్ధులకు సూచించాడు. తెలుగు అధ్యాపకుల మద్దిలేట మాట్లాడుతూ‘ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లిభాష. తెలుగును వాడుకభాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు పెద్ద పోరాటమే చేసారు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. ఆయన జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్న మనం…ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలి అని విద్యార్థులకు పిలుపు నిచ్చాడు.ఈ కార్యక్రమంలో  ఎన్ ఎస్ ఎస్  ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన పాటి,తెలుగు అధ్యాపకులు  మద్దిలేటి,లెక్చరర్స్ఓబులేసు, వెంకటరమణ,ముస్తాక్,శంకరయ్య,వెంకటేశ్వర్లు,మురళి మోహన్ గౌడ్,మంజునాథ్, వన్నూర్ తదితరులు పాల్గొన్నారు.

About Author