సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
1 min read

పెద్ద ఎత్తున హాజరైన యువతి యువకులు
కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర
యువతి,యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలొ ఉన్న ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉన్న జై సాల్ శిక్షణాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏలూరు మేత్రాసనం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్:జయరావు పొలిమేర, సోషల్ సర్వీస్ సెంటర్ చైర్మన్ జన్మిదినాన్ని పురస్కరించుకొని ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ తాటిపూడి ఇమ్మానుయేల్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏలూరు బిషప్ పొలిమేర జయరావు తండ్రి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.ఈ జాబ్ మేళలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శుభ సందర్భముగా మహాఘన బిషప్ డా: జయరావు పొలిమేర తండ్రి మాట్లాడుతూ ఏలూరు డైసీస్ పరిధిలో ఉన్నత చదువులు చదివి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు లభించక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆలోచించి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వారి యొక్క సెక్రెటరీ ని పంపించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జాబ్ మేలకి హాజరైన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ పి.బాల బీఈడీ కాలేజ్ కరస్పాండెంట్, వికార్ జనరల్, ఫాదర్ బి.రాజు ఎస్ఎస్సి వైస్ చైర్మన్,అండ్ మైకేల్ విచారణ కర్తలు ఏలూరు కతోలిక మహాదేవాలయం, ఫాదర్ మరియ జోజి ఎం ఎఫ్, ఫాదర్ స్టీవెన్, ఫాదర్ దివాకర్, ఫాదర్ సుందర్, ఫాదర్ మరి ఆనంద్,ప్రకాష్ ఫాదర్, ఫాదర్ నాకు అనిల్, మరియు తదితర గురువులు పాల్గొన్నారు. మటకన్యలు, వేలాది సంఖ్యలొ యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ఉద్యోగమేలను విజయవంతంగా పూర్తి చేశారు, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సర్వీస్ సెంటర్ సిబ్బంది మరియు పెరికె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెరికె వరప్రసాద్, మరియు జై సాల్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ నంది పాము వీరాస్వామి, ఉద్యోగులు సిబ్బంది మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు ఈ యొక్క జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


