NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి…

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలంలో అతిపెద్ద గ్రామమైన జలదుర్గం గ్రామాన్ని కొత్త మండలము కేంద్రముగా ఏర్పాటు చేయాలని డోన్ ఆవాజ్ కమిటి అధ్యక్షులు రసూల్, సిఐటియు ప్యాపిలి మండల సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, బిజెపి ప్యాపిలి మండల అధ్యక్షులు ఓబయ్య, ఎంఆర్పిఎస్ తాలూకా నాయకులు నాగేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చికెం నాగరాజు, ఖాజభాష, చాకలి మధు, జనసేనా పార్టీ నాయకులు మహమ్మద్ హనీఫ్ కలెక్టర్ కి వినతి పత్రం అంద జేశారు. జలదుర్గం గ్రామములో 10 వేలకు పైగా జనాభా ఉన్నదని, గ్రామములో జిల్లాపరిషత్ హై స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్టల్, పోస్ట్ ఆఫీస్, పశు వైద్యశాల, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంక్ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, జలదుర్గం, ఊట కొండ, రామకృష్ణాపురం, మాధవరం, గార్లదిన్నె, అలెబాద్ తాండా, మునిమడుగు, రాచర్ల, బొంచెరవు పల్లె, నేర డు, సీతమ్మ తాండా, కౌలుపల్లె గ్రామాల  సర్పంచ్ లు కూడా జలదుర్గం గ్రామాన్ని కొత్త మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని పంచాయతీ తీర్మానం చేశారని, కలెక్టర్ కి వివరించామన్నారు.

About Author