NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“జగన్ తీరుపై ప్రజలు నవ్వుకుంటున్నారు”..

1 min read

టీడీపీ యువ నేత మంజునాథ్ గౌడ్ & ఐటీడీపీ హనుమంతు…

హొళగుంద న్యూస్ నేడు:  హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో టిడిపి మండల యూత్ నాయకుడు మంజునాథ్ గౌడ్ మరియు ,ఐటిడిపి హనుమంతు మాట్లాడుతూ ….”సినిమా ఫంక్షన్లకు విఐపి పాసులు విన్నాం” గానీ ….సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వెళితే విఐపి పాసులు ఎందయ్యా?  

మేము ఏప్పుడు చూడలే…!  మేము ఏప్పుడు వినలే…!

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పరదాల మాటున పర్యటించారు అని, అధికారం కోల్పోయే కూడా ఆయన తీరు ఏమి మారలేదని మంజునాథ్ గౌడ్ అన్నారు. ఇటీవల పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత నియోజకవర్గ పులివెందులకు మొదటిసారి వచ్చారు. సోమవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ పులివెందులకు వచ్చారు.ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు. ఇటీవల జరిగిన పులివెందల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోవడంపై ఈ సందర్భంగా జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుందని టిడిపి యువ నేతలు అన్నారు. విఐపి పాసులు ఉన్న వ్యక్తులకే మాత్రమే భద్రత సిబ్బంది కలుసుకునేందుకు అనుమతించారు,విఐపి పాసులు లేని వారికి భద్రత సిబ్బంది బయటకు గెంటేసారని అన్నారు, “ఇంతకంటే అవమానం ఉంటుందా”? అని ప్రశ్నించారు.

About Author