బాధిత మహిళలకు కష్టంలో ఉన్న మహిళలకు అండగా ఉంటాం
1 min read

మహిళా సాధికారతకు అన్ని విధాల తోడ్పడుతాం
జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.శారద
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు/ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆదేశాలు ప్రకారము మిషన్ శక్తి లో భాగంగా 10రోజుల పాటు గ్రామీణ యువతకు , మహిళల కు మహిళా రక్షణ చట్టాలు, సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత కొరకు వివిధ శాఖల సమన్వయంతో అమలు జరుపుతున్న వివిధ రకాల కార్యక్రమాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుంది. అందులో భాగంగా మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని స్థానిక సత్రంపాడు లోని యూనియన్ బ్యాంక్ వారి గ్రామీణ మహిళల అభివృద్ధి శిక్షణ సంస్థ వారి కాన్ఫరెన్స్ హాల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సెల్ప్ హెల్ప్ గ్రూప్ సభ్యులు ,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సభ్యులు యూనియన్ బ్యాంక్ ఎస్ జి టి యువత /మహిళ శిక్షకులు, అంగన్వాడీ సిబ్బంది మరియు వివిధ రకాల హింసలకు గురైన యువత,మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.శారద మాట్లాడుతూ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న అంగన్వాడి సేవలు ,మిషన్ శక్తి ద్వారా అందిస్తున్న సేవలు, సదుపాయాలు మరియు మిషన్ వాత్సల్య ద్వారా అమలు జరుగుతున్న వివిధ రకాల కార్యక్రమాలు గురించి వివరించారు.జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్ తులసి మాట్లాడుతూ మిషన్ శక్తి ద్వారా నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్స్ నందు నిరాశ్రయులైన /బాధింపబడిన హింసకు గురి అయిన మహిళలకు తక్షణంగా ఆశ్రయం కల్పించటం కౌన్సిలింగ్ సర్వీసెస్ అందించటం పోలీస్, లీగల్ మరియు వైద్యపరమైన సేవలు అన్నింటిని సమన్వయం చేసుకుంటూ ఒకే చోట అందించే వన్ స్టాప్ సెంటర్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా మిషన్ శక్తి ద్వారా అందుబాటులో ఉన్న ఉద్యోగినుల వసతిగృహం/ శక్తినివాస్ మరియు శక్తి సదన్ బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించే వివిధ రకాల గృహములు గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు రక్షణ అందించే టోల్ ఫ్రీ నెంబర్ 181 గురించి తెలియజేయడం జరిగిందన్నారు.జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్ సూర్యచక్ర వేణి మాట్లాడుతూ జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం ద్వారా 18 సంవత్సరాల లోపు బాలలకు అందిస్తున్న సౌకర్యాల గురించి , అందించు సేవలు గురించి రక్షణ చట్టాల గురించి సంక్షేమ పథకాలు గురించి మరియు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలియజేశారు.కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ యువత ఉపాధి మహిళా శిక్షణా సంస్థ కో-ఆర్డినేటర్ డి శిరోమణి, ఫ్యాకల్టీ అన్నపూర్ణాదేవి డొమెస్టిక్ వైలెన్స్ సెల్ లీగల్ కౌన్సిలర్ రాగవమ్మ సోషల్ కౌన్సిలర్ రాధా పెదపాడు ఐసిడిఎస్ సూపర్వైజర్ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు డిసిపియు సిబ్బంది రాజు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

