NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌలు రైతుల కు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి

1 min read

ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి  కె. తిమ్మయ్య డిమాండ్..

పత్తికొండ , న్యూస్​ నేడు  : రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి కె. తిమ్మయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని నలక దొడ్డి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో కౌలు రైతుల సమస్యలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కౌలు రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కౌలు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనిఆందోళనలు నిర్వహిస్తున్న ఏమాత్రం పట్టించుకోకుండా,కౌలు రైతులను ఆవేదనకు గురిచేస్తుందని అన్నారు.భూ యజమానులు తో సంభంధం లేకుండా బ్యాంక్ లలో రుణాలు మంజూరు చేయాలని కోరారు. కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.కౌలు రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కుటుంబమంతా ఆరుగాలం శ్రమించిన అప్పులు తీరక  కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్తితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి. రాజా సాహెబ్, రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్, సీపీఐ  పట్టణ కార్యదర్శి ఎన్.రామాంజనేయులు, రైతు సంఘం నలక దొడ్డి గ్రామ శాఖ నాయకులు కె. రవి కుమార్, కౌలు రైతులు నరేష్, రంగన్న, లోకార్జున, సోమలింగప్ప, అల్లి పిరా, మల్లికార్జున, పి. ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author