శ్రీ ప్రతిభ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
1 min readపిడి ఎస్ యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు
ఆర్.ఐ.ఓ చంద్రశేఖర్ బాబు కి వినతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ధర్మాజీ గూడెం లో గల శ్రీ ప్రతిభ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆర్ ఐ ఓ కె. చంద్రశేఖర్ బాబు కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు కాకినాని, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివ మాట్లాడుతూ లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో గల శ్రీ ప్రతిభ రెగ్యులర్ జూనియర్ కళాశాలలో నాగార్జున యూనివర్సిటీ కి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎగ్జామ్స్ 17 నుండి జరుగుతున్నాయని. అయితే ఒక రెగ్యులర్ కాలేజీలో డిస్టెన్స్ నిర్వహించాలంటే సదరు సంబంధిత అధికారి అయిన ఆర్.ఐ.ఓ అనుమతి కచ్చితంగా తీసుకోవాలని కానీ కళాశాల యాజమాన్యం అటువంటి ఏమి పట్టించుకోకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అదేవిధంగా ప్రతిభ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు పక్కన ఉన్నటువంటి శ్రీ సాయి కళాశాల భవనములలో క్లాసులు నిర్వహిస్తున్నారని వీటి పైన వెంటనే విచారణ జరిపి ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కళాశాల వద్దే ఆందోళన కార్యక్రమం చేపడతామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొంగ సునీల్ కుమార్. ముళ్ళపూడి లారెన్స్. షేక్ అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.