ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి…
1 min read
విద్యార్థులు ఆరోగ్యవంతమైన జీవనం వైపు అడుగులు వేయాలి.
విద్యార్ధులు పోషకాలతో కూడిన అహారాన్ని తీసుకోవాలి.
ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి.
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి.
గాజువాక.విశాఖపట్నం.. న్యూస్ నేడు: ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అందరు కృషి చేయాలని,ప్రధానంగా విద్యార్ధులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన విద్యను పోందుతారని,జీవన శైలిలో నాణ్యమైన ఆహారం,వ్యాయామంతో ఆరోగ్యాన్ని పోందవచ్చని,ప్రజల్లో ఆరోగ్యవంతంగా జీవిచాలనే అంశంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి పిలుపునిచ్చారు. స్దానిక ప్రియదర్శిని ఉన్నత పాఠశాల, గాంధీనగర్, వుడా కాలనీ, గాజువాకలో లీ హెల్త్ డొమైన్ మరియు లీ ఫార్మా వారి సౌజన్యంతో మంగళవారం బాల బాలికలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆంత్రోపోమెట్రిక్ కొలతలు, ఫిట్ ఇండియా ప్రోటోకాల్ పరీక్షలు, వైద్యులచే శారీరక పరీక్షలు నిర్వహించారు, చివరగా విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో సలహాలు సూచనలు ఇచ్చారు. కౌమార దశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి అన్నారు.విద్యార్ధుల్లో చైతన్యం కల్పించే అవకాశం కల్పించినందుకు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక , క్యాంప్ కోఆర్డినేటర్ సరోజిని , జయలక్ష్మి , పోషకాహార నిపుణులు మాధురి, భాగ్యలత, ప్రియదర్శిని పాఠశాల కరస్పాండెంట్ రామారావు, ప్రిన్సిపాల్ మార్కండేయులు మరియు లీ ఫార్మా బృందం,తదితరులు పాల్గొన్నారు.


